మళ్లీ ఫిక్సయింది...

  • IndiaGlitz, [Tuesday,September 01 2015]

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రుద్ర‌మదేవి'. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోన‌గ‌న్నారెడ్డిగా, రానా ద‌గ్గుబాటి చాళుక్య వీర‌భ‌ద్రుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించారు.

ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. అయితే మధ్యలో బాహుబలి వంటి భారీ సినిమా రిలీజ్ వల్ల థియేటర్స్ సమస్య, చిన్న చిన్న టెక్నికల్ డెవలప్ మెంట్స్, ఆర్ధిక సమస్యలు అన్నీ కలిసి సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయడానికి దర్శక నిర్మాత గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు కానీ ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి సినిమాని అక్టోబర్ 9న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. మరి అప్పుడైనా కరెక్ట్ టైమ్ కి రిలీజ్ చేస్తాడంటారా చూద్దాం..