ఆస్కార్ రేసులో 'రుద్రమదేవి'
Send us your feedback to audioarticles@vaarta.com
అనుష్క టైటిల్ పాత్రలో గుణశేఖర్ దర్శక నిర్మాతగా గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన హిస్టారికల్ త్రీడీ చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రంలో గోనగన్నారెడ్డిగా అల్లుఅర్జున్, చాళుక్య వీరభద్రుడుగా రానా నటించారు. భారీ తారాగణంతో పాటు, భారీ టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు చిత్రాన్ని రూపొందిస్తానని కూడా గుణశేఖర్ తెలియజేశాడు.
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ హిస్టారికల్ చిత్రాన్ని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం కేటగిరీ క్రింద ఆస్కార్ అవార్డులకు పంపింది. ఈ విషయాన్ని గుణశేఖర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments