రుద్రమదేవిని హిందీలో వారు చేస్తున్నారు

  • IndiaGlitz, [Tuesday,September 01 2015]

కాక‌తీయ వీర‌నారి రుద్ర‌మ‌దేవిగా అనుష్క న‌టించిన రుద్ర‌మ‌దేవి అక్టోబ‌ర్ 9న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో రానా, అల్లు అర్జున్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తారు. గుణ‌శేఖ‌ర్ సొంత ప‌తాకంపై రూపొందించిన ఈ సినిమాకు ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించారు.

టాప్ టెక్నీషియ‌న్లు ప‌నిచేసిన ఈ సినిమాపై ఇప్ప‌టికే అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ సినిమాను అక్టోబ‌ర్ 9న హిందీలోనూ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ సినిమాను రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్, అభిషేక్ పిక్చ‌ర్స్ క‌లిసి విడుద‌ల చేయ‌నున్నారు.