'రుద్రమదేవి' వెనకుడుగు...

  • IndiaGlitz, [Monday,October 05 2015]

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం రుద్ర‌మదేవి'. ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోన‌గ‌న్నారెడ్డిగా, రానా ద‌గ్గుబాటి చాళుక్య వీర‌భ‌ద్రుడి పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. అయితే మధ్యలో బాహుబలి' వంటి భారీ సినిమా రిలీజ్ వల్ల థియేటర్స్ సమస్య, చిన్న చిన్న టెక్నికల్ డెవలప్ మెంట్స్, ఆర్ధిక సమస్యలు అన్నీ కలిసి సినిమా విడుదలను వాయిదా వేస్తూ వచ్చాయి.

చివరికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నామని అధికారకంగా తెలియజేశారు. 2D,3D ఫార్మెట్స్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తామని దర్శక నిర్మాత గుణశేఖర్ చెప్పి రోజైనా గడవకముందే తమిళంలో సినిమా రిలీజ్ డేట్ మారిపోయింది. తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న తేనాండల్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు ఈ విడుదల తేదీ కేవలం తమిళానికే పరిమితం అవుతుందా? లేక తెలుగు, హిందీ, మలయాళంలో కూడా మారుతుందా అని తెలియాల్సి ఉంది. చూద్దాం.

More News

ఈసారి రకుల్ వంతు

నటనకు సంబంధించిన నవరసాల్లో హాస్య రసాన్ని పండించడం కష్టమంటారు సినీ పెద్దలు.

రామ్ కి ఎంతో స్పెషల్...

కథానాయకుడుడిగా రామ్ ఎంట్రీ ఇచ్చి రానున్న సంక్రాంతితో పదేళ్లు పూర్తి కానుంది.అయితే ఈ తొమ్మిదేళ్లలో ఏ సంవత్సరం జరగని విషయం ఈ సంవత్సరంలో చోటు చేసుకోనుంది రామ్ విషయంలో.

నాగ్ సినిమాకీ అన్నిశుభ శకునములే

'మనం'వంటి మెమరబుల్ మూవీ తరువాత నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'.ఈ సినిమా కోసం నాగ్ రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు.

అందుకనే 'రుద్రమదేవి' చరిత్రను వక్రీకరించకుండా చిత్రీకరించాను - గుణ శేఖర్

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి.ఈ సినిమాలో రానా,అల్లు అర్జున్,క్రిష్ణంరాజు,నిత్యామీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

తమన్నా ఏ మాత్రం తగ్గట్టేదు

'బాహుబలి'విజయంతో తమన్నా క్రేజ్ మరింత పెరిగింది.ఇప్పుడు ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని తమన్నాని అప్ కమింగ్ సినిమాల్లో గ్లామర్ పరంగా బాగానే వాడుకుంటున్నారు