'బ్రూస్లీ' ఆలస్యంగా రావాలని ఒకరోజు..బాగుండాలని మరోరోజు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకుల్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య డి.వి.వి నిర్మించిన చిత్రం 'బ్రూస్లీ ద ఫైటర్'. ఎల్లుండి(అక్టోబర్16న) ఈ చిత్రం విడుదలవుతుంది. అయితే గుణశేఖర్ దర్శక నిర్మాణంలో రూపొందిన 'రుద్రమదేవి' చిత్రం అక్టోబర్ 9న విడుదలైంది. సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 'రుద్రమదేవి' విడుదలైన వారం రోజులకు 'బ్రూస్లీ' రావడం 'రుద్రమదేవి'కి ఒక రకంగా పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి.
థియేటర్స్ సమస్య ఒకవైపు క్రియేట్ అయితే, బ్రూస్ లీ కామెడి, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి మినిమమ్ గ్యారంటీ హిట్ మూవీగా రిలీజ్‌కి రెడీ అయింది. ఏ మాత్రం పాజిటివ్ బజ్ వచ్చినా ఆ ఎఫెక్ట్ 'రుద్రమదేవి'పై పడటం ఖాయం. అందుకని మొన్న జరిగిన ప్రెస్మీట్లో గుణశేఖర్ అండ్ టీమ్ దాసరి చేత బ్రూస్లీని ఆలస్యంగా విడుదల చేయించాలని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పించింది. అయితే రిలీజ్ డేట్ ముందుగానే అనౌన్స్ చేసుండటం వల్ల చరణ్ అండ్ టీమ్ వెనకడుగు వేయలేదు.
ఈ ఘటన గడిచి రెండు రోజులైనా కాకముందే రుద్రమదేవి టీమ్ వాయిస్ ఓవర్ చెప్పినందుకు చిరంజీవి ఇంత అప్లాజ్ వచ్చింది అలాంటిది గెస్ట్ అప్పియరెన్స్ చేసిన బ్రూస్లీ అక్టోబర్ 16న విడుదలవుతుంది. కాబట్టి బ్రూస్లీ చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్ అని పోస్ట్ చేశారు. ఒకరోజు బ్రూస్లీ చిత్రం ఆలస్యంగా రావాలని కోరుకున్నవాళ్ళే ఈరోజు మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెబుతుండటం ఓ రకంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments