ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. సమ్మెకు ముగింపు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఒకట్రెండోజులు కాదు ఏకంగా 48 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఈ ప్రకటనను కన్వీనర్‌తో పాటు మరో ముగ్గురు కో కన్వీనర్‌లు కలిసి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుని ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి చూస్తే ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణతో బస్సులు యథేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడిందన్న మాట. కార్మికులు విధుల్లో చేరడానికి.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూల వాతావరణ కల్పించాలని జేఏసీ కన్వీనర్ కోరారు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని.. బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు.
ప్రభుత్వం ఆర్టీసీని ఒక ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని తెలిపింది. కార్మికుల సమ్మె ఉద్దేశం సమస్యలు పరిష్కారానికే తప్ప విధులను విడిచిపెట్టడం కాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అశ్వత్థామ ఉదహరించి చెప్పారు. జేఏసీ నాయకులు, విపక్ష నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం సాయంత్రం ఈ ప్రకటనను విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments