ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా.. కేసీఆర్ శాశ్వతం కాదు!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వద్ధామరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ‘భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా..?. ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు. కొందరు మంత్రులు ఆర్టీసీ కార్మికులపై విమర్శలు చేసి, ఆపై ఇంటికి వెళ్లి రోదిస్తున్నారు. కొందరు మంత్రుల తనతో టచ్లో ఉన్నారు.
ఆర్టీసీ సమ్మెపై మేధావులు మౌనం వీడాల్సిన సమయం వచ్చింది. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకుంటే మాత్రం 1994 సంక్షోభం పునరావృతమవుతుంది. కేసీఆర్ ఆ విషయాన్ని మర్చిపోకూడదు’ అని ఈ సందర్భంగా అశ్వద్ధామ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే.. అశ్వద్ధామకు టచ్లో ఉండే మంత్రులు ఎవరు..? ఆయన వెనుక ఎవరున్నారు..? ఆయనతో ఎవరిలా మాట్లాడిస్తున్నారు..? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout