అశ్వత్థామా.. ఛీ మనిషివేనా నువ్వు!?: ఆర్టీసీ కార్మికులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రివర్స్ అయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కార్మికులు ఫైర్ అవుతున్నారు. సమ్మె విరమిస్తున్నట్లు అశ్వత్థామ సోమవారం నాడు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. అంతా మీ ఇష్టమేనా..? సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడానికి నువ్వెవరు..? అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తున్నారు. కాగా.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ కార్మికుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఎన్ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. అశ్వత్థామరెడ్డిపై కన్నెర్రజేశారు. ‘ఛీ మనిషివేనా నువ్వు ?.. ఆర్టీసిని తాకట్టు పెట్టి కేసీఆర్కు అమ్ముడుపోయావ్. కార్మికుల ఉసురు తగులుతుంది నీకు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది కార్మికులు చనిపోయారు. వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది. కార్మికుల జీవితాలతో అశ్వథ్థామరెడ్డి చెలగాటమాడుతున్నారు’ అని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 52 రోజులు పాటు సుధీర్ఘంగా సాగిన ఆర్టీసి సమ్మెకు సోమవారంతో తెర పడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments