అశ్వత్థామా.. ఛీ మనిషివేనా నువ్వు!?: ఆర్టీసీ కార్మికులు

  • IndiaGlitz, [Tuesday,November 26 2019]

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రివర్స్ అయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కార్మికులు ఫైర్ అవుతున్నారు. సమ్మె విరమిస్తున్నట్లు అశ్వత్థామ సోమవారం నాడు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. అంతా మీ ఇష్టమేనా..? సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడానికి నువ్వెవరు..? అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తున్నారు. కాగా.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో ఓ కార్మికుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఎన్‌ఎంయూ జిల్లా నాయకుడు రవి నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. అశ్వత్థామరెడ్డిపై కన్నెర్రజేశారు. ‘ఛీ మనిషివేనా నువ్వు ?.. ఆర్టీసిని తాకట్టు పెట్టి కేసీఆర్‌కు అమ్ముడుపోయావ్. కార్మికుల ఉసురు తగులుతుంది నీకు. రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది కార్మికులు చనిపోయారు. వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది. కార్మికుల జీవితాలతో అశ్వథ్థామరెడ్డి చెలగాటమాడుతున్నారు’ అని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 52 రోజులు పాటు సుధీర్ఘంగా సాగిన ఆర్టీసి సమ్మెకు సోమవారంతో తెర పడింది.

More News

డిసెంబర్ 3న 'మామాంగం' ట్రైలర్ విడుదల

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం'

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘ఎంతమంచివాడవురా’

నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా భారీగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'.

డ్రంకెన్ డ్రైవ్ కేసులో యంగ్ హీరోకు కోర్టు జరిమానా.. వార్నింగ్!

హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అనేక మంది సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకూ అడ్డంగా బుక్కవుతున్నారు.

‘మహా’ వ్యవహారంపై సుప్రీం సంచలన తీర్పు.. ఎవరి ధీమా వారిదే!

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రేపు అనగా..

మ్యూజిక్ సిట్టింగ్స్ లో '2+1'

షకలక శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్, ఆకృతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘2+1'చిత్రం కోసం మాస్ పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ రెండు పాటలు రాస్తున్నారు.