ఉబర్‌కు షాక్.. రూ.8 కోట్ల జరిమానా
Send us your feedback to audioarticles@vaarta.com
ఉబర్‌కు భారీ షాక్ తగిలింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.8 కోట్ల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.ఈ ఘటన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో జరిగింది. అంధురాలైన కారణంగా ఓ వృద్ధురాలిని క్యాబ్ డ్రైవర్ కారు ఎక్కించుకోకపోగా.. అవమానిస్తూ మాట్లాడటమే దీనికి కారణం. అమెరికాలో అంధులకు సీయింగ్ ఐ డాగ్ అనే పెంపుడు కుక్క ఉంటుంది. అంధులకు తాము వెళ్లాల్సిన చోటుకు మార్గం చూపడం వాటి విధి. శాన్ఫ్రాన్సిస్కోలోని బే ప్రాంతానికి చెందిన లిసా ఇర్వింగ్ (67ఏళ్లు) అనే అంధురాలు తనకు సాయంగా ఓ కుక్కను పెంచుకుంటోంది. ఆమె ఎక్కడివెళ్లినా ఆ కుక్క కూడా ఆమె వెంట వెళుతుంది.
ఈ క్రమంలోనే లిసా ఇర్వింగ్ తన ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకునే వరకు ఆలస్యమైంది. రాత్రి సమయం కావడంతో ఆమె తన నివాసానికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బెర్ చేసుకుంది. కారు రాగానే ఎక్కేందుకు సిద్ధమైన లిసా ఇర్వింగ్‌ను పక్కన కుక్క ఉండటంతో నిరాకరించడమే కాకుండా అవమానకరంగా మాట్లాడాడు. ఇలా ఆమెకు జరగడం మొదటి సారి కాదు.. ఎన్నో సార్లు జరిగింది. 2016-17 మధ్య కాలంలో మొత్తం 14 సార్లు లిసా ఇర్వింగ్‌ను ఉబర్ డ్రైవర్లు నిరాకరించారు. పదే పదే తనకు తలెత్తుతున్న ఇబ్బందిపై ఇర్వింగ్ న్యాయపోరాటానికి దిగింది.
దీనికి ముందు తన తొలి కర్తవ్యంగా ఉబర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే ఉబర్ యాజమాన్యం ఇర్వింగ్ ఫిర్యాదును పట్టిచుకోకపోగా.. తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఆర్బిటర్ ఆమె తరుఫున వాదించగా.. తీర్పు కూడా ఆమెకు అనుకూలంగానే వెలువడింది. ఉబర్దే తప్పని కోర్టు పేర్కొంది. అమెరికాలో అంధులు తమకు సాయంగా ఉండేందుకు కుక్కలను ఎక్కడికైనా తీసుకెళ్లే అవకాశం ఉందని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. క్యాబ్లోకి ఎక్కించుకోకపోవడం వివక్ష చూపడమేనని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఉబర్ సంస్థకు కోర్టు ఖర్చులు, ఇర్వింగ్‌కు నష్ట పరిహారం కింద మొత్తం రూ.1.1 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments