RS Praveen Kumar :బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్‌లోకి..!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ట్వీట్ చేశారు.
"పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ- బీఆరెస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. రాజీనామా తప్ప మరో మార్గం కనిపించడం లేదు"అంటూ పేర్కొన్నారు.
"నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. బహుజనుల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తాను" అంటూ తెలిపారు.
కాగా ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆర్ఎస్పీ కలిశారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా పొత్తుపై ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ సీట్లు కేటాయించారు. మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాగానే బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout