RS Praveen Kumar :బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్‌లోకి..!

  • IndiaGlitz, [Saturday,March 16 2024]

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ట్వీట్ చేశారు.

పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ- బీఆరెస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. రాజీనామా తప్ప మరో మార్గం కనిపించడం లేదుఅంటూ పేర్కొన్నారు.

నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటాను. బహుజనుల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేస్తాను అంటూ తెలిపారు.

కాగా ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆర్ఎస్పీ కలిశారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా పొత్తుపై ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ సీట్లు కేటాయించారు. మిగిలిన 15 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాగానే బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

More News

Modi:కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో తెలంగాణ నలిగిపోతుంది.. ప్రధాని మోదీ విమర్శలు..

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ నలిగిపోతుందని ప్రధాని మోదీ వాపోయారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు.

Venkatesh Daughter:కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం..

దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. విక్టరీ వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం శుక్రవారం రాత్రి సింపుల్‌గా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.

Mudragada: కాపుల్లో చెరగని 'ముద్ర'గడ.. వైసీపీలో చేరికతో విపక్షాల్లో అలజడి..

దశాబ్దాలకు కాపులకు పెద్దగా వ్యవహరిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం అప్పటి తెలుగుదేశం

Kavitha Arrest: బిగ్ బ్రేకింగ్: లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు.

నిజంకాని సీ-ఓటర్‌ సర్వేలు.. పచ్చ తమ్ముళ్లను చూసి నవ్వుకుంటున్న జనాలు..

ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అనేక సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. చాలా సంస్థలు చేసిన సర్వేల్లో అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెబుతున్నాయి.