RS Praveen Kumar :బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. ఆహ్వానించిన కేసీఆర్..
Send us your feedback to audioarticles@vaarta.com
బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందుకు తెలంగాణ భవన్ చేరుకున్న ఆయన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు ఒక్కటే అని.. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని తెలిపారు.
"బీఆర్ఎస్‌లో చేరుతున్నానని నిర్ణయం తీసుకున్నందుకు నన్ను చాలా మంది విమర్శిస్తున్నారు. నేను ఎటువంటి ప్యాకేజీలకు లొంగే వాడిని కాదు. నేను ఏమి ఆశించి పార్టీలోకి రాలేదు. ఏదైనా ఆశించే వాడిని అయితే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లేవాడిని కదా. నాలో ఎటువంటి స్వార్థం లేదు. నా గుండెల్లో బహుజన వాదం ఉంటుంది. మీరు గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల మందల వెళ్తున్నారు. ఆ గొర్రెల మందలో ఒక్కణ్ని నేను కాలేను" అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాకు టీఎస్‌పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. నేను తిరస్కరించాను.. ఎవరైనా ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉంది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి నన్ను సున్నితంగా హెచ్చరిస్తున్నారు. నాకు నా రాజకీయ నిర్ణయం తీసుకునే స్వేచ్చ లేదా? నేనూ పాలమూరు బిడ్డనే.. నడిగడ్డ గాలి పీల్చి పెరిగాను. రేవంత్ రెడ్డి ఇలాంటి హెచ్చరికలు మానుకోవాలి. నాయకులను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. స్వార్థపరులే కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తెలంగాణ వాదం, బహుజన వాదం గోదావరి ప్రాణహిత, కృష్ణా తుంగభద్ర లాగా కలిసిపోతాయి’’ అంటూ ఆర్‌ఎస్పీ వెల్లడించారు.
కాగా ఇటీవల బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా హైదరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ సీట్లు బీఎస్పీకి కేటాయించారు. అయితే లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ తర్వాత బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ఆర్ఎస్పీ తెలిపారు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments