YS Sharmila: మహిళలకు ప్రతి నెలా రూ.8500.. ఏపీ కాంగ్రెస్ 9 గ్యారంటీలు ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
తాము అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలను అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల తెలిపారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అలాగే 9 గ్యారెంటీ హామీల కరపత్రం, డోర్ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని తెలిపారు.
మొదటి గ్యారెంటీ: రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా
రెండవ గ్యారెంటీ: మహిళా మహాలక్ష్మి (ప్రతి పేద మహిళలకు ప్రతి నెలా రూ.8500.. అంటే ఏడాదికి లక్ష రూపాయలు)
మూడవ గ్యారెంటీ: రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ
నాలుగవ గ్యారెంటీ: పెట్టుబడి మీద 50 శాతం లాభం తో కొత్త మద్దతు ధర
ఐదవ గ్యారెంటీ: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం 400 రూపాయలు
ఆరవ గ్యారెంటీ: కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
ఏడవ గ్యారెంటీ: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాల భర్తీ.. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల మీదే
ఎనిమిదవ గ్యారెంటీ: ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద రూ.5లక్షలతో పక్కా ఇళ్లు
తొమ్మిదవ గ్యారెంటీ: అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4వేల పెన్షన్, వికలాంగులకు రూ.6వేల పెన్షన్
అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చించేందుకు ఆదివారం షర్మిల ఢిల్లీ వెళ్తునున్నానని.. అనంతరం సోమవారం అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని షర్మిల తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడదాం మన బిడ్డల భవిష్యత్ కాపాడుకుందామని ఆమె పిలుపునిచ్చారు. చంద్రబాబు, జగన్‌కి ఓటేస్తే బీజేపీకే ఓటు వేసినట్లే అని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలని కార్యకర్తలకు వివరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com