6 కోట్ల సెట్...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ హీరో విజయ్, అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెరి, మెర్సల్ తర్వాత వీరి కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిర్మాత కల్పాతి అఘోరం సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చెన్నైలో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ ఫుట్బాల్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నారు.
మరో భారీ షెడ్యూల్ కోసం ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో ఈవీపీ స్టూడియోలో భారీ ఫుట్ బాల్ స్టేడియంను నిర్మించబోతున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments