బన్నీ 'పుష్ప'లో 6కోట్లతో భారీ యాక్షన్ సీన్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ.. క్రియేటివ్ హెడ్‌గా పేరుగాంచిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే బన్నీ బర్త్‌డే సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కరోనా మహమ్మారి విలయ తాండవం లేకుంటే ఈ పాటికే సినిమా షూటింగ్ 70% పైగా అయిపోయేది. కానీ.. కరోనా ఎఫెక్ట్‌తో చిత్రబృందం ఇంటికే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చూసుకుంటోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ‘పాన్ ఇండియా’గా వస్తున్న ఈ చిత్రం కోసం భారీగానే మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు పెడుతోంది.
రేంజ్ అలాంటిది..!
పాన్ ఇండియా కావడంతో సీన్స్‌తో పాటు ఫైట్లు కూడా అదే రేంజ్‌లో ఉండాలని భావించిన చిత్రబృందం.. భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించాలని అనుకుందట. ఇదీ కూడా హాలీవుడ్ రేంజ్ అట. ఇందుకుగాను హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్లను రప్పించాలని అనుకున్నారట. అయితే అక్కడ కరోనా విజృంభిస్తుండటం.. రోజురోజుకూ మరణాలు ఎక్కువవుతుండటం.. ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఇక్కడున్న మాస్టర్లతో సరిపెట్టుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో పీటర్ హెయిన్స్‌తో పాటు కనల్ కన్నణ్‌లతో ఈ సన్నివేశాలను చిత్రీకరించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది.
ఆరు కోట్ల రూపాయిలతో..
ఈ సన్నివేశాల కోసం రూ. 6కోట్లతో భారీగానే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. అది కూడా ఒకే ఒక్క ఫైట్ సీన్ కోసం కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మే-17 తర్వాత లాక్ డౌన్ పూర్తయ్యాక షూటింగ్‌కు అనమతి ఇస్తే మొదట ఈ సన్నివేశాలే చిత్రీకరించాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే పీటర్, కనల్‌ను సంప్రదించి ఆన్‌లైన్‌లోనే అడ్వాన్స్ కూడా ఇచ్చుకున్నారని టాక్ నడుస్తోంది. వాస్తవానికి బన్నీ సినిమా అటు ఫైట్లతో మాస్‌కు.. ఇటు డ్యాన్స్‌తో క్లాస్‌కు దగ్గరగా ఉంటుందన్న విషయం విదితమే. అందుకే దర్శకనిర్మాతలు కూడా భారీ యాక్షన్ సీన్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఇది కూడా అడవిలో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిదే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com