ఈ ఇయర్ లో 50 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలు ఇవే..
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి, శ్రీమంతుడు చిత్రాలు రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. తెలుగు సినిమాలు ఇంత భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుండడానికి ప్రధాన కారణం ఓవర్ సీస్ బిజినెస్. మరో నైజాం రేంజ్ లో ఓవర్ సీస్ మార్కెట్ విస్తరించడంతో ఎవరూ ఊహించని విధంగా తెలుగు సినిమా వంద కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి తన సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. దీంతో సీనియర్ హీరోలు - యువ హీరోలు తమ చిత్రాలు బాహుబలి - శ్రీమంతుడు చిత్రాల వలే 100 కోట్ల క్లబ్ లో చేరకపోయినా... 50 కోట్ల క్లబ్ లో చేరితే చాలు అనుకుంటున్నారు. అందుచేత సీనియర్ హీరోలు - యువ హీరోల ఫస్ట్ టార్గెట్ 50 కోట్లు మార్క్ ను అందుకోవడం. మరి..ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 50 కోట్ల మార్క్ ను అందుకున్న చిత్రాల వివరాలు మీకోసం....
ఈ సంవత్సరంలో 50 కోట్ల మార్క్ ను అందుకున్న సంచలన చిత్రం సోగ్గాడే చిన్నినాయనా. అక్కినేని నాగార్జున హీరోగా నూతన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతికి కానుకగా రిలీజైన సోగ్గాడు...పోటీ ఉన్నప్పటికీ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఎవరూ ఊహించని రికార్డ్స్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు నాగార్జున. ఎంత పెద్ద సినిమా అయినా రెండు - మూడు వారాలు మాత్రమే ఆడుతున్న ఈరోజుల్లో..సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం 110 సెంటర్స్ లో 50 రోజులు 4 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఊహించని విధంగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం 53 కోట్లుకు పైగా షేర్ సాధించి..50 కోట్ల క్లబ్ లో చేరిన వన్ అండ్ ఓన్లీ సీనియర్ హీరోగా నాగార్జున చరిత్ర సృష్టించారు.
సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం తర్వాత 50 కోట్ల క్లబ్ లో చేరిన మరో చిత్రం నాన్నకు ప్రేమతో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన నాన్నకు ప్రేమతో...చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా రిలీజైన నాన్నకు ప్రేమతో...చిత్రం యంగ్ టైగర్ కి 25వ చిత్రం కావడం విశేషం. తండ్రి - కొడుకుల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా అద్భుతంగా తెరకెక్కించారు సుకుమార్. సింపుల్ రివేంజ్ స్టోరీ అనిపించే స్టోరీ లైన్ తో రూపొందిన నాన్నకు ప్రేమతో.. ఊహించని ట్విస్ట్స్ & మైండ్ గేమ్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టైలీష్ యాక్షన్ ఓవర్ సీస్ ఆడియోన్స్ ను బాగా ఆకట్టుకుంది. అందుకనే నాన్నకు ప్రేమతో...యు.ఎస్ లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ 15 ఏళ్ల కెరీర్ లో 25వ చిత్రం నాన్నకు ప్రేమతో.. 50 కోట్ల మార్క్ ను అందుకోవడం విశేషం.
సోగ్గాడే చిన్ని నాయానా, నాన్నకు ప్రేమతో...ఈ రెండు చిత్రాల తర్వాత 50 కోట్ల క్లబ్ లో చేరిన మరో చిత్రం ఊపిరి. టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో ఊపిరి చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. తెలుగు, తమిళ్ లో ఈ భారీ మల్టీస్టారర్ మూవీని పి.వి.పి సంస్థ నిర్మించింది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమాకి ఊపిరి అయ్యింది. విమర్శకుల ప్రశంసలందుకున్న ఊపిరి చిత్రం ఆడియోన్స్ ను ఎంతగానో ఆకట్టుకుని...మంచి చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని మరోసారి నిరూపించింది. ముఖ్యంగా ఊపిరి ఓవర్ సీస్ లో ఆడియోన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. 1.5 మిలియన్స్ కి పైగా వసూలు చేసి మనం రికార్డ్ ను క్రాస్ చేసి...నాగార్జున కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ నిలిచి ఊపిరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు - తమిళ్ ఈ రెండు భాషల్లో ఊపిరి శాటిలైట్ రైట్స్ కి మంచి డిమాండ్ ఉంది. శాటిలైట్ రైట్స్ పరంగా భారీ మొత్తాన్ని దక్కించుకోనుంది. తెలుగు, తమిళ్ భాషల్లో కలుపుకుని ఊపిరి చిత్రం ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా గ్రాస్...40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఐదవ వారంలో కూడా ఊపిరి ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండడం విశేషం.
సోగ్గాడు, నాన్నకు ప్రేమతో.., ఊపిరి చిత్రాల తర్వాత 50 కోట్ల క్లబ్ లో చేరిన మరో చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్ నటించింది. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గబ్బర్ సింగ్ సినిమాకి సీక్వెల్ కాకపోయినా..గబ్బర్ సింగ్ క్యారెక్టర్ ను తీసుకుని సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని రూపొందించారు. జానీ తర్వాత పవన్ సర్ధార్ గబ్బర్ సింగ్ కి కథ - స్ర్కీన్ ప్లే అందించడం ఓ విశేషం అయితే...ఫస్ట్ టైమ్ పవన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. భారీ అంచనాలతో రిలీజైన సర్ధార్ గబ్బర్ సింగ్ టాక్ తో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్లు షేర్ వసూలు చేసింది. డివైడ్ టాక్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ వీక్ లో దాదాపు 50 కోట్లు షేర్ సాధించింది అంటే దటీజ్ పవర్ స్టార్ స్టామినా. ఏ హీరోకి ఇలాంటి రికార్డ్ లేదు. పవర్ స్టార్ సాధించిన న్యూరికార్డ్ ఇది.
సర్ధార్ తర్వాత 50 కోట్ల క్లబ్ లో చేరిన మరో చిత్రం సరైనోడు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. బన్ని స్టైల్ - బోయపాటి యాక్షన్ కలసి స్టైలీష్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు రూపొందింది.సర్ధార్ వలే సరైనోడు కూడా టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం ఓ విశేషం అయితే.. నాలుగు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయడం మరో విశేషం. ఇప్పటి వరకు దాదాపు 35 కోట్లు పైగా షేర్ వసూలు చేసి 50 కోట్ల షేర్ సాధించే దిశగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది సరైనోడు చిత్రం.
ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల్లో 5 చిత్రాలు 50 కోట్లను వసూలు చేసాయి. ఈ 5 చిత్రాల్లో 2 నాగార్జున చిత్రాలు ఉండడం విశేషం. వచ్చే నెలలో నితిన్ - త్రివిక్రమ్ అ ఆ, సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సంవత్సరం ఎండింగ్ కి ఇంకెన్ని సినిమాలు 50 కోట్ల క్లబ్ లో స్ధానం దక్కించుకుంటాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com