మంత్రి రాసలీలల సీడీ.. రూ.5 కోట్లకు డీల్.. అసలా మహిళెక్కడ?
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటక రాజకీయాలలో దుమారం రేపిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వ్యవహారం మిస్టరీగా మారింది. ఒకవైపు సదరు ఆరోపణలు చేసిన మహిళ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నేటికీ ఆమె జాడ తెలియరాలేదు. అయితే ఆమె కనిపించకుండా పోవడం వెనుక ఓ ప్రముఖ నేత హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీడీ వెనుక రూ. 5కోట్ల ఒప్పందం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం ఉందని మాజీ సీఎం కుమారస్వామి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మైసూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలుత సీడీ గురించి మాట్లాడే వ్యక్తిని అరెస్టు చేయాలన్నారు. ఇంకా తన వద్ద సీడీలు ఉన్నాయని ప్రకటించడం వెనుక బ్లాక్‌మెయిల్ కనిపిస్తోందన్నారు.
ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా ఈ విధంగా చూపడం తప్పని కుమారస్వామి పేర్కొన్నారు. తనకున్న సమాచారం ప్రకారం మూడు నెలల కిందటే సీడీ చూపించి బ్లాక్‌మెయుల్ చేశారని తెలిపారు. దీని వెనుక బడా నేతల హస్తముందని ఆయన చెబుతున్నారు. సమాజంలో విసుగుపుట్టించే పరిస్థితి నెలకొందని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. ఒక మాజీ సీఎం ఎక్కడికెక్కడో వెళ్లివస్తారని.. సదరు సీడీ కూడా తన వద్ద ఉందని చెబుతున్నారని, అదెవరిదో చెబితే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో దేవేగౌడ, ఎస్‌ఎం కృష్ణ కాలం నుంచి ఎంతోమంది సీఎంలుగా పనిచేశారని, ప్రజా జీవితంలో వారిని అనుమానంతో చూసే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు.
మరోవైపు రమేష్ జార్కిహోళి సోదరుడు బాలచంద్ర జర్కిహోళి కథనం మరోలా ఉంది. తన సోదరుడిని కావాలని ఈ కుట్రలో ఇరికించారని... దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బాలచంద్ర డిమాండ్ చేస్తున్నారు. అది ఫేక్ వీడియో అనేది ఆయన వాదన. దానిని విడుదల చేసినవారిపై రూ.100 కోట్లు పురువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. సామాజిక కార్యకర్త, నాగరిక హక్కు పోరాట సమితి దినేష్ కలహళ్లి ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. రమేష్ జర్కిహోళి రాసలీలలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన ఆ సీడీలను మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout