ఐదు కోట్ల సాంగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ `2.0`.ఒక సాంగ్ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ సాంగ్ మాత్రం భారీ స్థాయిలో రూపొందనుందట. ఈ సాంగ్ కోసం పెట్టే ఖర్చు తెలిస్తే షాక్ కావాల్సిందే. అక్షరాలా ఐదు కోట్లు. ఒక సాంగ్‌కు అంత ఖర్చు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. శంకర్ టేకింగ్ అంటే అలానే ఉంటుంది. చెన్నైలో భారీ సెట్ వేస్తున్నారట.
ఈ సాంగ్ కోసం 12 రోజులు పట్టనుందట. అందులో 10 రోజులు ప్రాక్టీస్ ఉంటుందనేది ఎమీజాక్సన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. సాంకేతికంగా భారీ స్థాయిలో ఉండనున్న 2.0 సినిమాను 400కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com