సాయి పల్లవికి రూ. 5 కోట్ల లాస్.. ఎలా జరిగిందంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమమ్ చిత్రంతో సాయి పల్లవి సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో మాత్రం ఫిదా చిత్రంతో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే యువతని మాయచేసేసింది. అలాగని అందాల ప్రదర్శన చేయలేదు. తన నటన, చిలిపిదనంతోనే సాయి పల్లవి యువతని ఆకర్షించింది.
స్కిన్ షోకి ఇప్పటికి సాయిపల్లవి ఆమడ దూరంలో ఉంటుంది. తన పాత్రలో గ్లామర్ అంశాలు ఉన్నా, ప్రాధాన్యత తక్కువ ఉన్నా ఆ చిత్రాన్ని వెంటనే రిజెక్ట్ చేసేస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈ విషయంలో సాయి పల్లవి చాలా క్లారిటీగా ఉంటుంది. గ్లామర్ రోల్స్ పై గతంలోనే సాయి పల్లవి కొన్ని కామెంట్స్ చేసింది.
Also Read: అనుష్కపై స్టార్ హీరో క్రష్.. ఆమెకు ఫిదా అంటూ కామెంట్స్
నేను నటించే చిత్రాలు నా ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా ఉండాలి. వారు గర్వపడాలి.. అంతే కానీ ఇబ్బందిపడే విధంగా ఉండకూడదు. అందుకే నా చిత్రాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని సాయి పల్లవి తెలిపింది. సినిమా అన్నాక గ్లామర్ లేకుండా ఎలా అని పెదవి విరిచిన వారు సైతం ఉన్నారు. కానీ సాయి పల్లవి మాత్రం తన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటుంది.
ఈ క్రమంలో ఆమె బడా చిత్రాలని సైతం రిజెక్ట్ చేసిందని టాక్. ఇటీవల కాలంలోనే సాయిపల్లవి సినిమాలు రిజెక్ట్ చేయడం ద్వారా దాదాపు 5 కోట్లకు పైగా నస్టపోయినట్లు తెలుస్తోంది. డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో మొదట హీరోయిన్ గా సాయి పల్లవికే ఆఫర్ వచ్చిందట. కానీ తన పాత్ర నచ్చక వదులుకుంది.
అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పన్ కోషియం రీమేక్, బెల్లంకొండ శ్రీనివాస్ కాదన్ రీమేక్ లని కూడా రిజెక్ట్ చేసింది. సాయిపల్లవి రెమ్యునరేషన్ రూ.80 లక్షల పైనే ఉంటుంది. ఈ లెక్కన ఆమె రిజెక్ట్ చేసిన చిత్రాలని బట్టి సాయి పల్లవి దాదాపు రూ 5 కోట్లవరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. పలు కమర్షియల్ యాడ్స్ ని కూడా సాయిపల్లవి వదులుకుంది.
ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలలో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments