నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి.. రూ.2 లక్షల జరిమానా..

  • IndiaGlitz, [Friday,May 28 2021]

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి లాక్‌డౌన్, కర్ఫ్యూలు విధిస్తూ పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొందరు మాత్రం ఇప్పటికే పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చి ఉండటంతో వాయిదా వేసుకోలేకపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని చంద్రయ్యపేట గ్రామంలో ఓ పెళ్లి పెద్దలకు అధికారులు షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.2 లక్షల రూపాయల జరిమానా విధించడంతో ఇరువైపుల పెళ్లి పెద్దలతో పాటు పెళ్లికి వచ్చిన వారు సైతం అవాక్కయ్యారు. చంద్రయ్యపేట (సీది) గ్రామంలో కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిని ఇరువైపుల పెద్దలూ వైభవంగా జరిపించారు. సమాచారం అందుకున్న పాతపట్నం తహశీల్దార్ కాళీప్రసాద్, ఎస్ఐ మహ్మద్ అమీర్ అలీ అక్కడకు చేరుకున్నారు. పెళ్లివారికి 2 లక్షల రూపాయల జరిమానా విధించారు.

More News

సుప్రీం హీరోతో ఉప్పెన బ్యూటీ.. మళ్ళీ సుకుమారే

ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఉప్పెన చిత్రంలో ఆమె లుక్స్, నటన అందరిని కట్టి పడేశాయి. ప్రస్తుతం కృతి శెట్టి..

కండిషన్ పెట్టిన కూతురు.. గడ్డం తీసేసిన మంచు విష్ణు

హీరో మంచు విష్ణు ఫ్యామిలీ మ్యాన్. ఎల్లప్పుడూ ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతాడు. విష్ణు తరచుగా తన కుటుంబ విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంటాడు.

జడ్జ్ అమ్ముడుపోయారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్

వరల్డ్ ఫేమస్ జంట ఏంజెలినా జోలీ.బ్రాడ్ పిట్ లు ఇక అధికారికంగా విడిపోనున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

స్టన్నింగ్ హాట్.. నడుము సొగసుతో మంత్రం వేస్తోంది

ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయే అని చెప్పాలి. ఆమెకు అనంతపూర్ బ్యాగ్రౌండ్ ఉంది. తెలుగు సుస్పష్టంగా మాట్లాడగల నటి. నటించిన తొలి చిత్రం టాక్సీవాలాతో హిట్ అందుకుంది.

సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వివాదం.. నాగ్ కి అసహనం కలిగిన వేళ..

ఇటీవల విడుదలైన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'ట్రైలర్ మంచి అటెన్షన్ తీసుకుంది. ముఖ్యంగా సమంత రోల్ సౌత్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.