నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి.. రూ.2 లక్షల జరిమానా..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నాయి. సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటంతో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి లాక్డౌన్, కర్ఫ్యూలు విధిస్తూ పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయి. కొందరు మాత్రం ఇప్పటికే పెద్ద మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చి ఉండటంతో వాయిదా వేసుకోలేకపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని చంద్రయ్యపేట గ్రామంలో ఓ పెళ్లి పెద్దలకు అధికారులు షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.2 లక్షల రూపాయల జరిమానా విధించడంతో ఇరువైపుల పెళ్లి పెద్దలతో పాటు పెళ్లికి వచ్చిన వారు సైతం అవాక్కయ్యారు. చంద్రయ్యపేట (సీది) గ్రామంలో కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిని ఇరువైపుల పెద్దలూ వైభవంగా జరిపించారు. సమాచారం అందుకున్న పాతపట్నం తహశీల్దార్ కాళీప్రసాద్, ఎస్ఐ మహ్మద్ అమీర్ అలీ అక్కడకు చేరుకున్నారు. పెళ్లివారికి 2 లక్షల రూపాయల జరిమానా విధించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments