Telangana Elections: తనిఖీల్లో రూ.1760కోట్లు పట్టివేత.. తెలంగాణలోనే అత్యధికం..

  • IndiaGlitz, [Tuesday,November 21 2023]

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నగదు, మద్యం ఏరులైపారుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు ఈ రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ఎర వేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల తనఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటివరకు మొత్తం రూ.1750కోట్ల అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, బహుమతులు, ఇతరత్రా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీఈసీ వెల్లడించింది. అక్టోబరు 9న ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేసినట్లు తెలిపింది.

తెలంగాణలో అత్యధికంగా దాదాపు రూ.659 కోట్ల మేర సీజ్ చేసినట్లు పేర్కొంది. ఇక రాజస్థాన్ లో రూ.650.7 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.323.7 కోట్లు, ఛత్తీస్ గఢ్ రూ.76.9 కోట్లు సీజ్ చేసినట్లు వెల్లడించింది. కాగా 2018లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీజ్‌ చేసిన దాంతో పోలిస్తే వీటి విలువ దాదాపు ఏడు రెట్లు ఎక్కువని చెప్పింది. గత ఎన్నికల్లో కేవలం రూ.239.15 కోట్లు పట్టుబడగా.. ఈసారి ఏకంగా రూ.1760కోట్లు అక్రమంగా పట్టుబడినట్లు ప్రకటించింది.

ఇక ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఈ నెల 25న రాజస్థాన్‌లో, 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తనిఖీల సందర్భంగా తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణలో సీజ్ చేసిన నగదు మొత్తంలో రూ.225.23 కోట్ల నగదు రూపంలో ఉండగా, రూ.86.82 కోట్ల విలువైన మద్యం, రూ.103.74 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, రూ.191.02 కోట్ల విలువైన బంగారం, వెండి, ఆభరణాలు, ఓటర్లకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ.52.41 కోట్ల విలువైన వస్తువులు ఉన్నట్లు తెలిపింది. పోలింగ్ ముగిసేనాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

 
 

More News

ఫిషింగ్ హార్బర్ బాధితులకు అండగా సీఎం జగన్.. భారీగా పరిహారం ప్రకటన

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Aadikeshava:ఊర మాస్‌గా మెగా హీరో.. 'ఆదికేశవ' ట్రైలర్ రిలీజ్..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆదికేశవ' నుంచి ట్రైలర్ విడుదలైంది. లవ్, రొమాన్స్, కామెడీ,

Trisha:త్రిష గురించి మన్సూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం

హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలు దేశవ్యా్ప్తంగా పెను దుమారం రేపుతున్నాయి.

Kodali Nani:నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్..

గుడివాడ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ పకోడీగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని

CP Sandeep Shandilya:హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు గుండెపోటు

హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో