ఊహించని ట్విస్ట్ తో అడ్డంగా బుక్కైన జ్యోతిష్కుడు.. రూ.17 కోట్ల నకిలీ దందా!
Send us your feedback to audioarticles@vaarta.com
తన ఇంట్లో పెద్ద చోరీ జరిగిపోయినట్లు బిల్డప్ ఇచ్చిన జ్యోతిష్కుడు అడ్డంగా పోలీసులకు బుక్కయ్యాడు. అతడి బండారం బయట పడ్డ తర్వాత పోలీసులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఊహించని ట్విస్ట్ లతో కూడిన ఈ రియల్ క్రైమ్ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
గుంటూరు పిడుగురాళ్లకు చెందిన మురళి శర్మ ప్రముఖ జ్యోతిష్కుడిగా పాపులర్ అయ్యాడు. పలు టివి ఛానల్స్ లో జాతకాలపై షోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు అతడు చదివింది 10వ తరగతి వరకు. 2017లో భక్తి నిధి పేరుతో ఓ వెబ్ సైట్ ఓపెన్ చేశాడు. ఈ వెబ్ సైట్ ద్వారా రంగురాళ్ల ఆన్లైన్ లో విక్రయించేవాడు.
ఆ తర్వాత టివి ఛానల్స్ లో జాతకాలపై షోలు చేసేవాడు. జ్యోతిష్కుడిగా కొనసాగుతూనే నూరుద్దీన్ అనే వక్తితో కలసి క్రైం బిజినెస్ ప్రారంభించాడు. ఇద్దరూ కలసి హవాలా దందా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో అతడి అకౌంట్ లోకి పెద్ద మొత్తంలో నగదు బదిలీ కావడంతో బ్యాంక్ అధికారుల ద్వారా సిబిఐ అధికారులు మురళి శర్మని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.
ఈసారి మురళి శర్మ తన మకాం హైదరాబాద్ కు మార్చాడు. నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. హవాలా దందా చేస్తున్న టైంలో మురళీశర్మ వద్ద ఉన్న నకిలీ కరెన్సీని అతడి అసిస్టెంట్ పవన్ కుమార్ నిజమైన కరెన్సీ అని భ్రమపడ్డాడు. ఆ డబ్బుని దొంగిలించాలని ప్లాన్ చేశాడు.
పిడుగురాళ్లలో తనకు స్నేహితులతో కలసి స్కీచ్ వేశాడు పవన్ కుమార్. పవన్ కుమార్ అతడి స్నేహితులు మురళి శర్మ ఇంట్లో నకిలీ కరెన్సీ ఉన్న రెండు ట్రాలీ బ్యాగులని దొంగిలించారు. ఆ తర్వాత అవి నకిలీవి అని అర్థం అయింది. దీనితో ఆ కరెన్సీని బ్యాగులతో సహా తగలబెట్టి వెళ్లిపోయారు.
ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తన ఇంట్లో డబ్బు, విలువైన వజ్రాలు చోరీకి గురయ్యాయని మురళీశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు పవన్ కుమార్ అతడి స్నేహితులని అరెస్ట్ చేసి విచారించారు. అవి నకిలీవి అని వారు నిజం చెప్పడంతో మురళీశర్మ బండారం బయట పడింది.
మురళీశర్మ ఇంట్లో పోలీసులు తనిఖీ నిర్వహించగా రూ 17 కోట్ల నకిలీ కరెన్సీ బయటపడింది. మొత్తం 2000 నోట్ల నకిలీ కరెన్సీనే. దీనితో పోలీసులు అందరిని అరెస్ట్ చేసి లోతైన విచారణ ప్రారంభించారు. మురళీశర్మ హవాలా దందాకు సహకరిస్తున్న వారిని జల్లెడ పడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout