క్రేజీ థ్రిల్లర్ చిత్రానికి రూ. 100 కోట్ల బడ్జెట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల బడ్జెట్ లెక్కలు మారిపోయాయి. కథ బావుంటే ఎంతైనా ఖర్చు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. కానీ తాజాగా ఓ థ్రిల్లర్ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నట్లు ప్రకటించిన నిర్మాత అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ చిత్రం మరేదో కాదు.. ఇటీవల ప్రకటించిన 'రాక్షసుడు 2'.
రెండేళ్ల క్రితం విడుదలైన రాక్షసుడు మూవీ మంచి విజయం సాధించింది.సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించారు. ఓ సైకో వరుసగా బాలికలని అతి దారుణంగా హత్య చేసే కథతో రాక్షసుడు చిత్రం తెరకెక్కింది. తమిళంలో వచ్చిన రాక్షసన్ చిత్రానికి ఇది రీమేక్. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.
కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం వీరు రాక్షసుడు 2కి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత సత్యనారాయణ ఆసక్తికర వివరాలు వెల్లడించారు. రాక్షసుడు 2 చిత్రాన్ని భారీ స్థాయిలో 100 కోట్ల బడ్జెట్ లో నిర్మించనున్నట్లు తెలిపారు.
మొదటి భాగం కంటే రెట్టింపు థ్రిల్లింగ్ రెండవ భాగం ఉంటుందట. ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు కూడా జోడించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు. ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం రమేష్ వర్మ.. రవితేజ హీరోగా ఖిలాడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాక్షసుడు 2 చిత్రానికి ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్ మొత్తం లండన్ లోనే జరగనుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments