వంద‌కోట్లు.. 4 భాష‌లు.. భారీ మ‌ల్టీస్టార‌ర్‌

  • IndiaGlitz, [Sunday,May 27 2018]

మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో 'మ‌ర‌క్కార్'- ది ల‌య‌న్ ఆఫ్ అరేబియ‌న్ సి అనే సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున న‌టిస్తుండ‌టం విశేషం. మ‌రి నాగ్ పాత్ర ఎంత సేపు ఉంటుందో, తీరు తెన్నులెంటో తెలియ‌డం లేదు.

కాగా ఈ సినిమా బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ప‌రేశ్ రావ‌ల్ సైతం న‌టిస్తుండ‌టం విశేషం. ఈ సినిమాను తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంతో పాటు హిందీలో కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే సీనియ‌ర్ న‌టులైన నాగార్జున‌, సునీల్ శెట్టి, ప‌రేశ్ రావ‌ల్ మ‌ల‌యాళంలో ఈ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు.