తిండి విషయంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' యూనిట్‌ తీసుకున్న నిర్ణయం

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)'. ఇందులో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్.. గోండు వీరుడు కొమురంభీమ్ పాత్రలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నిజమైన చారిత్ర‌క పాత్రల క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. రూ.400 కోట్ల‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం దాదాపు ఆరేడు నెలలు కరోనా కారణంగా షూటింగ్‌ను ఆపింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం విధించిని విధి విధానాలతో రీసెంట్‌గా సినిమా రీస్టార్ట్‌ అయ్యింది. అయితే కరోనా టైమ్‌లో తాము కొన్ని నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ముందుకెళుతున్నామని రాజమౌళి రీసెంట్‌ ఇంటర్వ్యూలో తెలియజేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో వర్కర్స్‌కు తిండి పెట్టడం లేదట. తిండి ఎవరికివాళ్లు ఇంటి నుండి తెచ్చుకోవాలని అందుకోసం వర్కర్స్‌కు రోజురు రెండు వందల యాబై రూపాయలు చెల్లిస్తున్నారని టాక్‌. ఇది కిందిస్థాయి ఉద్యోగులకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే అయినా కూడా ప్రస్తుతం కోవిడ్‌ను కంట్రోల్‌ చేయాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకతప్పేలా లేదు.

More News

అనుష్క విషయంలో తప్పులో కాలేసిన గూగుల్..

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ విషయంలో గూగుల్ తప్పులో కాలేసింది.

జస్టిస్ ఎన్వీ రమణపై యుద్ధంలో సీఎం జగన్ గెలుస్తారా?

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సర్కార్ యుద్ధం ప్రకటించింది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

అలనాటి ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ల జంట రాజన్-నాగేంద్ర‌లో తమ్ముడు రాజన్ (87) సోమవారం బెంగళూరులో కన్నుమూశారు.

సుజాత హౌస్ నుంచి అవుట్.. రివెంజ్ తీర్చుకున్న స్టాఫ్..

సండే.. ఫన్‌డే.. రివెంజ్‌లతో పాటు ఎలిమినేషన్.. అంతా మంచి జోష్‌తో నడిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి ఖుష్బూ రాజీనామా.. మధ్యాహ్నం బీజేపీలో చేరిక..

తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ సోమవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.