తారక్ ఫ్యాన్స్‌కి 'ఆర్ఆర్ఆర్' ట్రీట్ రెడీ
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా లాక్డౌన్ కారణంగా షూటింగ్‌ను ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం విధివిధానాలతో మంగళవారం నుండి షూటింగ్ ప్రారంభమైనట్లు 'ఆర్ఆర్ఆర్' ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోను యూనిట్ విడుదల చేసింది. కోవిడ్ ప్రభావాన్ని ఎదుర్కొంటూ ప్రారంభమైన షూటింగ్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. తామేం చేశామనే విషయాన్ని తెలియజేస్తూ యూనిట్ ప్రోమోను విడుదల చేసింది. అంతే కాదండోయ్ ఈ వీడియో రెండు విషయాలు తెలిశాయి. రామ్‌చరణ్ గుర్రంపై వెళితే, ఎన్టీఆర్ బుల్లెట్‌ను ఉపయోగిస్తాడని. అలాగే కొమురంభీమ్ జయంతి అక్టోబర్ 22 సందర్భంగా ఈ సినిమాలో భీమ్‌గా నటిస్తున్న తారక్ ప్రోమోను విడుదల చేయబోతున్నామని.. దీనికి రామరాజుగా నటిస్తోన్న చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని అనౌన్స్ చేశారు. రామరాజు ఫర్ భీమ్‌గా తారక్ కోసం ఆయన అభిమానులు అక్టోబర్ 22 వరకు అతృతగా ఎదురు చూడక తప్పదు. ఇప్పటికే భీమ్ ఫర్ రామరాజు ప్రోమో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
"మార్చి వరకు మా షూటింగ్ అనుకున్నట్లు చేశాం. ఆ తర్వాత ప్రపంచమంతా ఆగిపోయింది. ఇప్పుడు సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమైంది.. రెట్టించిన ఉత్సాహంతో..." అంటూ మెసేజ్‌తో పాటు వీడియోను విడుదల చేశారు. ఇందులో అన్నీ విభాగాలవాళ్లు షూటింగ్‌ను పునః ప్రారంభించడానికి ఏమేం పనులు చేశారనే దాంతో పాటు మంగళవారం నుండి షూటింగ్ జరగనుందని తెలియజేశారు. చివర్లో హీరోస్ రెడీ, యాక్షన్ అని జక్కన్న వాయిస్‌ను, ముఖాలు సరిగా కనిపించని హీరోలు రామ్‌చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బుల్లెట్‌పై రావడాన్ని చూడొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com