‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ క్యాన్సిల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిపై రెండు తెలుగు ప్రభుత్వాలు పెద్ద బాధ్యతనే పెట్టాయనుకోవాలి. ఎందుకంటే కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. రెండు నెలల తర్వాత ప్రభుత్వాలు సినిమాల షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చాయి. అయితే విధి విధానాలను కఠినంగా రూపొందించాయి. రెండు వందల మందితో షూటింగ్ చేయాల్సిన సన్నివేశాలను యాబై మందితో చేసుకోమని సలహా ఇచ్చింది. ఇది చాలా మంది దర్శక నిర్మాతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.
ఈ సమయంలో రాజమౌళి తాను ఎన్టీఆర్, చరణ్‌లతో చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను ప్రభుత్వ విధి విధానాల్లో డూప్‌లను పెట్టి చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అయితే పోలీసుల నుండి అనుమతి సమాయానికి రాలేదు. దీంతో జక్కన్న అండ్ వెయిట్ చేయడం కంటే ట్రయల్ షూట్‌ను క్యాన్సిల్ చేద్దామనే ఆలోచనతో ఉందని టాక్.
దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తోన్న ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ దేవగణ్, అలియా భట్, శ్రియా శరన్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com