అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్‌లో ‘‘ఆర్ఆర్ఆర్’’ టీమ్.. ఫోటోలు వైరల్

టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ ‘‘ఆర్ఆర్ఆర్’’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా దేశంలో కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తర్వాత పరిస్ధితులు అనుకూలించడంతో మార్చి 25న ఆర్ఆర్ఆర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్  కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఇప్పటికే కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, న్యూఢిల్లీలలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లను నిర్వహించారు .

తాజాగా రాజమౌళి-చరణ్-తారక్ త్రయం అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత గోల్డెన్ టెంటల్‌ని సందర్శించారు. తెలుపు వస్త్రాలు ధరించి..తలకి  తెల్లటి కర్చీప్ లు కట్టుకుని వీరు ముగ్గురు దేవుడికి నమస్కరిస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఇకపోతే.. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

తల్లి కాబోతోన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. బేబీ బంప్‌తో ఫోటో వైరల్

ప్రస్తుతం హీరోయిన్లు వరుసపెట్టి గర్భం దాలుస్తున్నారు. ఒకరి వెంట మరొకరు  మాతృత్వాన్ని అందుకునేందుకు సిద్ధమవుతున్నారు.

పుష్ప పార్ట్ 2 : పాన్ ఇండియా క్రేజ్.. ఈ సారి రెమ్యూనరేషన్ కింద ‘‘హిందీ’’ రైట్స్ అడుగుతోన్న బన్నీ..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు.

నన్ను వాడుకొని వదిలేశారు, ఎన్నో సార్లు మోసపోయా : మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను ఎంతోమందికి ఉపయోగపడ్డానని..

ఊర మాస్ లుక్‌లో నేచురల్ స్టార్ .. అంచనాలు పెంచేస్తోన్న ‘దసరా’ పోస్టర్

ఫ్యామిలీ, లవ్, కామెడీ సినిమాలు చేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చిన నేచురల్ స్టార్ నానీ..

మా కోసం ఆయన తగ్గి, ఎన్నో మాటలు పడ్డారు.. చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద : రాజమౌళి వ్యాఖ్యలు

కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌లో జరిగిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ..