అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ‘‘ఆర్ఆర్ఆర్’’ టీమ్.. ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ ‘‘ఆర్ఆర్ఆర్’’. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా దేశంలో కోవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తర్వాత పరిస్ధితులు అనుకూలించడంతో మార్చి 25న ఆర్ఆర్ఆర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఇప్పటికే కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్, న్యూఢిల్లీలలో ప్రీ రిలీజ్ ఈవెంట్లను నిర్వహించారు .
తాజాగా రాజమౌళి-చరణ్-తారక్ త్రయం అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత గోల్డెన్ టెంటల్ని సందర్శించారు. తెలుపు వస్త్రాలు ధరించి..తలకి తెల్లటి కర్చీప్ లు కట్టుకుని వీరు ముగ్గురు దేవుడికి నమస్కరిస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ఇకపోతే.. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com