క్వారంటైన్‌కు వెళ్లనున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం.. నెలాఖరులో షూటింగ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా దెబ్బకు ఆగిపోయిన సినిమాలన్నీ క్రమక్రమంగా షూటింగ్ బాట పడుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ పైనే ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అటు ఇద్దరు ఇష్టమైన స్టార్ హీరోలు.. ఇటు దర్శకధీరుడు రాజమౌళి చిత్రం కావడంతో ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టంతా ‘ఆర్‌ఆర్‌ఆర్’ పైనే ఉంది.
అయితే చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా కరోనా బారిన పడటంతో సినిమా ఆలస్యమవుతుందని అంతా భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ఈ సినిమా కూడా షూటింగ్‌కు సిద్ధమవుతోంది. అభిమానుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టి షూటింగ్‌కు కావల్సిన ఏర్పాట్లు చిత్ర యూనిట్ చేస్తోంది. అయితే కోవిడ్ కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకునే రంగంలోకి దిగనుంది.
షూటింగ్ సమయంలో ఆ ప్రాంతంతో పాటు వినియోగించే సామాగ్రి మొత్తాన్ని ప్రతి రోజూ శానిటైజేషన్ చేయనున్నారు. థర్మల్ స్ర్కీనింగ్ ద్వారా షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతే కాకుండా ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోయే వారందరినీ హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉంచనున్నారని సమాచారం. 14 రోజుల అనంతరం అందరికీ నెగిటివ్ వస్తేనే షూటింగ్ ప్రారంభమవుతుందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అక్టోబర్ చివరిలో ప్రారంభం కాబోయే షెడ్యూల్‌లో తారక్, రామ్‌చరణ్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com