క్వారంటైన్‌‌కు వెళ్లనున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం.. నెలాఖరులో షూటింగ్..!

కరోనా దెబ్బకు ఆగిపోయిన సినిమాలన్నీ క్రమక్రమంగా షూటింగ్ బాట పడుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పైనే ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అటు ఇద్దరు ఇష్టమైన స్టార్ హీరోలు.. ఇటు దర్శకధీరుడు రాజమౌళి చిత్రం కావడంతో ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టంతా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పైనే ఉంది.

అయితే చిత్ర దర్శకుడు రాజమౌళి సహా ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా కరోనా బారిన పడటంతో సినిమా ఆలస్యమవుతుందని అంతా భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ఈ సినిమా కూడా షూటింగ్‌కు సిద్ధమవుతోంది. అభిమానుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టి షూటింగ్‌కు కావల్సిన ఏర్పాట్లు చిత్ర యూనిట్ చేస్తోంది. అయితే కోవిడ్ కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకునే రంగంలోకి దిగనుంది.

షూటింగ్‌ సమయంలో ఆ ప్రాంతంతో పాటు వినియోగించే సామాగ్రి మొత్తాన్ని ప్రతి రోజూ శానిటైజేషన్ చేయనున్నారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా షూటింగ్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతే కాకుండా ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోయే వారందరినీ హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉంచనున్నారని సమాచారం. 14 రోజుల అనంతరం అందరికీ నెగిటివ్ వస్తేనే షూటింగ్ ప్రారంభమవుతుందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అక్టోబర్ చివరిలో ప్రారంభం కాబోయే షెడ్యూల్‌లో తారక్, రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

More News

అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ వీక్షకులకు థ్రిల్ ఇస్తున్న 'జీ 5' ఒరిజినల్ వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్' ట్రైలర్

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌.

ఏపీ సీఎం జగన్ మామ గంగిరెడ్డి మృతి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన మామ, వైఎస్ భారతిరెడ్డి తండ్రి అయిన ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు.

హైదరాబాద్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు..

హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. బోరబండలో భూమి కంపించింది. రాత్రి 8.45, 11.42 నిమిషాలకు రెండు సార్లు భూమి కంపించింది.

తీగల వంతెనపై సరికొత్త ఆంక్షలు.. రాత్రి 11 దాటితే బంద్..

హైదరాబాద్‌‌కు దుర్గం చెరువుపై తీగల వంతెన మరో ఐకాన్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే.

అక్టోబర్.. కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం

అక్టోబర్ వచ్చేసింది. రూలింగ్ అయితే మారలేదు కానీ రూల్స్ మాత్రం మారిపోయాయి.