వామ్మో.. రాజమౌళిపై ఇన్ని కంప్లైంట్సా?.. చెర్రీ, తారక్ కూడా..

దర్శకధీరుడు రాజమౌళిపై కంప్లైంట్ల వర్షం కురిపించింది ‘ఆర్ఆర్ఆర్’ టీం. అది కూడా ఆయన పుట్టినరోజు నాడు. ఎవరి పుట్టిన రోజైనా వస్తే గిఫ్ట్స్ ఇస్తాం.. విషెస్ చెబుతాం. వారు గొప్పవారైతే ఆయన చేసిన మంచి పనులను తలుచుకుంటూ ప్రశంసలు కురిపిస్తాం. కానీ ‘ఆర్ఆర్ఆర్’ టీం ఉందే.. రాజమౌళిపై కంప్లైంట్ల మీద కంప్లైట్లు.. చివరికి ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా దర్శకధీరుడిని వదల్లేదు. ఒకరకంగా చెప్పాలంటే వీరిద్దరే కాస్త ఎక్కువ కంప్లైట్లు చేశారు. అయితే ఇదంతా నిందాస్తుతిలా సాగిందిలెండి. చూడటానికి నిందిస్తున్నట్టున్నా.. రాజమౌళిలోని నిబద్ధతను, సింప్లిసిటీని, పెర్ఫెక్షన్‌ను చక్కగా స్తుతించారు.

రొటీన్‌కు భిన్నంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం రాజమౌళికి చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. చూసి బాగా ఎంజాయ్ చేయడమే కాదు.. నెటిజన్ల నుంచి జక్కన్నకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ‘‘జనవరి నెలలో పల్లవి చేస్తాం.. ఆరు నెలల తర్వాత చరణం చేస్తాం.. డిసెంబర్‌లో దానికి లిరిక్ రాయిస్తాడు. నెక్ట్స్ ఇయర్‌ మార్చిలోనో ఎప్పుడో దాని రికార్డింగ్ అంటాడు.. ఆ తర్వాత వచ్చే నవంబర్‌లో వాయిస్ మిక్సింగ్ ఉంటుంది. ఈ లోపు ఏ సినిమాకు పని చేస్తున్నామో.. పర్సస్ ఏంటో మర్చిపోతాం. ఇంట్రస్ట్ పోతోంది’’ అని కీరవాణి విసుక్కున్నారు.

కాంప్లికేటెడ్ షాట్స్ ఎప్పుడూ రిలాక్స్ అవుదామనుకున్న సమయంలోనే షూట్ చేస్తుంటాడు. కరెక్ట్‌గా 12:30 ఒక షాట్.. ఆయన పెడతాడో.. మా దరిద్రానికి వచ్చి తగులుకుంటుందో తెలియదు కానీ.. ఇక అక్కడి నుంచి మొదలు పెడతాడు.. ఆ షాట్ ఓకే అవ్వదు. 12:30 నుంచి ఒంటిగంట అయిపోతుంది.. షాట్ ఓకే అవ్వదు. ఒక్క పట్టాన సంతృప్తి చెందడు.. దర్శక రాక్షసుడు.. చెక్కుతూ.. చెక్కుతూ.. చెక్కుతూ.. 2:30 అయిపోద్ది. ఈలోపు మనకున్న ఆకలి చచ్చిపోద్ది’’ అంటూ తారక్ చెప్పుకొచ్చాడు.

ఇక చెర్రీ.. ‘‘ఆర్ఆర్ఆర్‌లో రాజమౌళి గారు యాక్షన్ సీన్‌ని షూట్ చేస్తున్నారు. జిమ్ చేసి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అనగానే.. ‘చరణ్ కమ్.. కమ్.. వచ్చి కూర్చో’ అంటాడు. ఒకరు 40 ఫీట్ నుంచి జంప్ చెయ్యాలి. అదిరిపోద్ది షాట్. అదిరిపోయింది సర్. ఎవరు చేస్తున్నారు? కొంచెం రిస్కీగా ఉంది కదా.. అంటే.. ‘ఎవరు చేస్తారేంటి చరణ్ నువ్వే..’ అంటారని చెప్పుకొచ్చాడు. ఇంకా ఒక సీన్ ఎలివేషన్ గురించి చెర్రీ వెల్లడించాడు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది కూడా రాజమౌళిపై ఫన్నీ ఫన్నీగా ఆరోపణలు చేశారు.

 

More News

'పీన‌ట్ డైమండ్' చిత్రం ప్రారంభం

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా రూపొందుతోన్న

దిశ సినిమాపై కోర్టులో పిటిషన్‌... స్పందించిన నట్టికుమార్‌

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'దిశా ఎన్‌కౌంటర్‌'. గత ఏడాది నవంబర్‌ 26న దిశపై జరిగిన అత్యాచారం, హత్య...

విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ షాక్‌

హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ శుక్రవారం పెద్ద షాకే ఇచ్చింది. వివరాల్లోకెళ్తే... విశాల్‌, సుందర్‌.సి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'యాక్షన్‌'.ఈ సినిమా విడుదల సమయంలో

సూసైడ్ చేసుకోవాలనుకున్నానన్న అవినాష్.. మోనాల్‌పై నమ్మకం లేదన్న అఖిల్

ఇవాళ షో మొత్తాన్ని అవినాష్ కంప్లీట్‌గా హ్యాండోవర్ చేసుకున్నాడు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ అవినాష్‌కే దక్కింది. చూసే వాళ్లకే కాదు.. కంటెస్టెంట్లలో కూడా మంచి జోష్‌ని నింపాడు. ఇక షో విషయానికి వస్తే..

అన్‌లాక్ 5.0 నిబంధనలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కేంద్రం జారీ చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.