షూటింగ్‌లో చెర్రీకి గాయాలు.. ఆందోళనలో మెగాభిమానులు

  • IndiaGlitz, [Wednesday,April 03 2019]

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి నిర్మిస్తున్న భారీ చిత్రం #RRR. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ ప్రాంభమైంది. అయితే బుధవారం నాడు షూటింగ్‌‌లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు గాయాలయ్యాయి. మంగళవారం ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా కాలి చీలమండకు గాయమైంది. దీంతో పుణే షెడ్యూల్‌ను రద్దు చేశారు. ఈ మేరకు #RRR చిత్రబృందం అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు, సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మరో మూడు వారాల తరవాత షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇదిలా ఉంటే.. అనుకోకుండా చరణ్ గాయపడటంతో చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్ తగిలినట్టయింది.

ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలుసుకున్న మెగా కుటుంబానికి సన్నిహితులు, ఆప్తులు ఫోన్లు చేసి అసలేం జరిగిందని ఆరా తీశారు. మరోవైపు అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెర్రీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా అభిమానులు ఆందోళనతో రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం ట్విట్టర్‌లో స్పందించారు. ఆయనకి పాజిటివ్ ఎనర్జీ కావాలని, త్వరగా కోలుకోవాలని కోరారు. 

కాగా.. 24 గంటల క్రితమే షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేసిన విషయం విదితమే. చరణ్ మూడు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం యధావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమాలో అలియా భట్, డైసీ ఎడ్గర్ జోనస్ హీరోయిన్లుగా చెర్రీ, తారక్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.

చెర్రీ స్పందన...
‘ఆర్ఆర్ఆర్’ షెడ్యూల్ చాలా బాగా జరుగుతోంది. కానీ దురదృష్టవశాత్తు నేను వర్కవుట్ చేస్తుండగా నా యాంకెల్‌కు దెబ్బ తగిలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. వైద్యులు కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మూడు వారాల్లో మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాను. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దుఅని చెర్రీ చెప్పారు.