ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ .. కన్ఫర్మ్ చేసిన విజయేంద్ర ప్రసాద్, అంతా ఓకే మరి ముగ్గురికీ డేట్స్ కుదిరేదెప్పుడు..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్‌ల నటనకు తోడు జక్కన్న టేకింగ్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే సినిమా చూసిన వారంతా సీక్వెల్ వుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
'బాహుబలి'ని రెండు భాగాలుగా తీసిన రాజమౌళి, 'RRR'ను రెండు భాగాలుగా తెరకెక్కించలేదు. అయితే... రామ్, భీమ్ పాత్రలతో సీక్వెల్ తీస్తే బావుంటుందనే కోరిక చాలా మందిలో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం సీక్వెల్ గురించి రాజమౌళిని అడిగారు. దీనికి సంబంధించిన వివరాలను రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఆయన ఏమన్నారంటే.. ‘‘ ఒక రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చారు. నేనూ, రాజమౌళి ఇద్దరం ఉన్నాం. మాటల సందర్భంలో 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ తీసే వీలు ఉందా? అనే అంశం చర్చకు వచ్చింది. ఇందుకు వీలున్న అవకాశాలను అన్వేషించడం మొదలు పెట్టాం. కొన్ని ఐడియాలు వచ్చి, అందరికీ నచ్చాయి. భగవంతుడు కోరుకుంటే సీక్వెల్ వస్తుంది" అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన మాటలను బట్టి 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ ఓకే అయిపోయినట్లుగా తెలుస్తోంది. కాకపోతే... మళ్ళీ ఎన్టీఆర్, చరణ్ డేట్స్ అడ్జస్ట్ కావడానికి కొంత టైమ్ పట్టవచ్చని ఫిలింనగర్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో ఒకటి, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమాల్లో నటించనున్నారు. అటు చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, ఆ తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు. మరోవైపు రాజమౌళి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాల్సి వుంది. ఈ ముగ్గురూ తమ తమ ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన తర్వాత 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పట్టాలు ఎక్కుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com