ఇంగ్లీష్ సహా ఐదు విదేశీ భాషల్లో RRR విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలితో దేశం మొత్తం తన సత్తా చాటిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా తన ప్లాన్స్ అమలు చేయబోతున్నాడు. తన సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చే విధంగా రాజమౌళి వడివడిగా అడుగులు చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ టీం నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.
ఆర్ఆర్ఆర్ డిజిటల్, శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న తమ పార్ట్నర్స్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. జీ నెట్వర్క్ సంస్థ తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ డిజిటల్ హక్కులతో పాటు హిందీ శాటిలైట్ హక్కులని సొంతం చేసుకుంది. అంటే డిజిటల్, శాటిలైట్ రైట్స్ సింహభాగాన్ని జీ సంస్థ సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: ఈ వయసులో కూడా తప్పు చేశా.. లవ్ బ్రేకప్ పై సీనియర్ హీరోయిన్
ఇక హిందీ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక విదేశీ డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కీష్, స్పానిష్ లాంటి విదేసీ భాషల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. పెన్ స్టూడియోస్ సంస్థ హిందీ థియేట్రికల్ హక్కులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
బాహుబలి చిత్రం చైనా, జపాన్ దేశాల్లో అలరించింది. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అంతర్జాతీయంగా మరింత ముందుకు తీసుకుపోవాలని రాజమౌళి భావిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గాక ఆర్ఆర్ఆర్ విడుదలపై క్లారిటీ రానుంది. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com