‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..!
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్). ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్.. గోండు వీరుడు కొమురంభీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు నిజమైన చారిత్రక పాత్రల కల్పితగాథే ఈ చిత్రం. రూ.400 కోట్లతో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బ్రిటీష్ భామ ఒలివియా మోరిస్ నటిస్తుండగా రామ్‌చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.
ఈ సినిమాను ముందు ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే చిన్న చిన్న కారణాలు, మేకింగ్‌లో కాంప్రమైజ్ కావాలనుకోకపోవడంతో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అంతా ఓకే అవుతుందని అనుకుంటున్న తరుణంలో కోవిడ్ ఎఫెక్ట్ స్టార్ట్ కావడంతో షూటింగ్స్ ఆగాయి. ఆరు నెలలు దాటినప్పటికీ యూనిట్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పడు స్టార్ట్ చేసినా ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేం. కానీ.. రాజమౌళి షూటింగ్ అయిన వరకు గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేయిస్తున్నాడట. మిగతా షూటింగ్‌ను త్వరగానే పూర్తి చేసి జూలై 30, 2021లో విడుదల చేసేలా అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ.. రాజమౌళి ఔట్‌పుట్ విషయంలో రాజీపడడు కాబట్టి ఇప్పుడు వినిపిస్తోన్న రిలీజ్ డేట్ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments