మెగా- నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్.. హైదరాబాద్‌లో ఈ ఐదు థియేటర్లలో ‘‘ఆర్ఆర్ఆర్’’ స్పెషల్ షో, ఉ.7కి ముందే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ‘‘ఆర్ఆర్ఆర్’’ మరికొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రాష్ట్రాల్లో స్పెషల్ షోకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో అభిమానులు ధియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్‌లు అల్రెడీ హౌస్ ఫుల్ అయ్యాయి. థియేటర్లలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. థియేటర్లలో స్క్రీన్ల వద్ద ఇనుప మేకులు, కంచెలను బిగించారు. అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు థియేటర్ల వద్ద తమ అభిమాన కథానాయకుల భారీ బ్యానర్ల కటౌట్లను ఏర్పాటు చేశారు.
ఇకపోతే.. రేపు ఉదయం 7గంటల నుంచి స్పెషల్ షోలు ప్రారంభం కానున్నాయి. అయితే అభిమానుల కోరిక మేరకు హైదరాబాద్‌లోని ఐదు థియేటర్లలో స్పెషల్ బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరంలోని భ్రమరాంబ (కూకట్పల్లి), మల్లికార్జున (కూకట్పల్లి), విశ్వనాథ్ (కూకట్పల్లి), అర్జున్ (కూకట్పల్లి), శ్రీరాములు (మూసాపేట) మాత్రమే ఉదయం 7 గంటల కన్నా ముందే బొమ్మపడనుంది. అది కూడా కేవలం 25వ తేదీ వరకు మాత్రమే పరిమితం. ప్రభుత్వ అనుమతి ఇచ్చిన థియేటర్లు కాకుండా ఇంకెక్కడైనా సినిమాను ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments