కేక పెట్టిస్తున్న `ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ బిజినెస్
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ రీసెంట్‌గా ఈ చిత్రాన్ని జనవరి 8, 2021లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. సినిమా చిత్రీకరణ దాదాపు ఎనబై శాతం వరకు పూర్తయ్యి ఉండటం ఒకపక్క.. సినిమా రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ కావడంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినపడుతున్న సమాచారం మేరకు ఇండియాలో ఏ సినిమాకు కానంతగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందట. ఆ నెంబర్ వినగానే షాకవడం ఖాయం. గుసగుసల మేరకు రూ. 833 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయ్యిందట.
నైజామ్ ఏరియాలో రూ.75 కోట్లు, సీడెడ్‌లో రూ.36 కోట్లు, వైజాగ్‌లో రూ.24 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.14 కోట్లు, నెల్లూరులో రూ.9కోట్లు, కృష్ణా రూ.15 కోట్లు, తమిళంలో రూ.80 కోట్లు, ఓవర్‌సీస్‌లో రూ.70 కోట్లు, బాలీవుడ్‌లో రూ.175 కోట్లు వెచ్చించి హక్కులను సొంతం చేసుకున్నారట. ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కు భారీ ధర దక్కిందట. ఈ సినిమా కోసం నిర్మాతలు రూ.400 కోట్లు ఖర్చు పెడుతుంటే రెట్టింపు లాభాన్నిచూస్తున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com