ఆర్‌ఆర్‌ఆర్’ క్లైమాక్స్.... ప్రాక్టీస్‌లో రామ్ & భీమ్!
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆర్‌ఆర్‌ఆర్’ క్లైమాక్స్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయింది. అయితే, భారీ క్లైమాక్స్ కావడంతో మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నట్టు ఉన్నారు. త్వరలో తీయబోయే సీన్స్ కోసం అల్లూరి సీతారామరాజు అలియాస్ రామ్‌చరణ్, కొమురం భీమ్ అలియాస్ ఎన్టీఆర్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. అప్పుడు తీసిన ఫొటో ఇది.
బాలీవుడ్ యాక్టర్ నికితిన్ ధీర్‌కి ‘ఖిలాడి’ టీమ్ వెల్కమ్ చెప్పింది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అతడు కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో నికితిన్‌కి నాలుగో చిత్రమిది. ఇంతకు ముందు ‘కంచె’, ‘గౌతమ్ నందా’, ‘మిస్టర్’లో నటించాడు.
అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమాను ఫిబ్రవరి 19న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. నరేష్ కామెడీ సినిమాలకు కంప్లీట్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రూపొందింది. బాక్సాఫీస్ దగ్గర అతడి సినిమాకు సుమంత్ సినిమా పోటీగా వస్తోంది. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కావలుధారి`ని తెలుగులో 'కపటాధారి'గా సుమంత్ రీమేక్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ కూడా ఫిబ్రవరి 19నే. ఇందులో నందిత హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com