మెగా నందమూరి ఫ్యాన్స్‌కు ఊరట.. ‘‘ఆర్ఆర్ఆర్’’ కొత్త రిలీజ్ డేట్, ఈ రెండింటిలో ఏదో ఒకరోజు

  • IndiaGlitz, [Friday,January 21 2022]

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. షెడ్యూల్ ప్రకారం జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ .. కరోనా, ఒమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. అనేక రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యూపెన్సీకే థియేటర్లు నడవాలని ప్రభుత్వాలు ఆదేశించడంతో ఆర్ఆర్ఆర్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోక తప్పలేదు. దీంతో అప్పటి వరకు పడిన శ్రమ, ప్రమోషన్ల కోసం పడిన ప్రయాస అంతా వృథా అయ్యింది. ఈ నేపథ్యంలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగా- నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. మార్చి 18న లేదంటే.. ఏప్రిల్ 28న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. దేశంలో కోవిడ్ తగ్గి... థియేటర్లు తెరుచుకుని ఫుల్ కెపాసిటీతో రన్ అయితే... మార్చి 18న సినిమా విడుదల చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. లేనిపక్షంలో ఏప్రిల్ 29న సినిమా విడుదల అవుతుంది అని 'ఆర్ఆర్ఆర్' టీమ్ పేర్కొంది.

ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

More News

This is How Amazon Prime Video are Honoring the Legacy of late Puneeth Rajkumar!

Honouring the creative prowess of Late Puneeth Rajkumar, Prime Video today announced a slate of three new Kannada movies with PRK Productions which includes Man of the Match, One Cut Two Cut and Family Pack, to be available exclusively for Prime Members worldwide.

Siddhant Chaturvedi is now "Everyone's Apple of the Eye" Nowadays, Here's Why!

Siddhant made a splash with the trailer of Gehraiyaan, with audiences raving about his sizzling and intense chemistry with Deepika Padukone, one of the biggest female superstars in the country today and on the other hand have also commented about the comfortable equation he shares with Gen-Z star Ananya Panday in the coming-of-age film.

Samantha shares pictures of her adventures from the Europe vacay! - Viral photo

Samantha is one of the top heroines in the South Indian film industry. She has gained multiple projects in Bollywood

'Gehraiyaan' trailer out: Deepika Padukone and Siddhant Chaturvedi are the highlights of this romantic drama

She said, "You have never seen any Indian actor play a character like this. Relationships are Shakun's forte. And by relationships I don't mean boyfriend girlfriend

Deepika Padukone justifies frequent intimate scenes in 'Gehraiyaan' trailer 

She said, "Intimacy of vulnerability is only possible when you know that the director is not doing it to scintillate, he's not doing it for the eyeballs.”