ఆర్ ఆర్ ఆర్ మ్యూజిక్ సీక్రెట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఏ విషయమైనా ఆసక్తికరంగానే ఉంటుంది. అటు రాజమౌళికి సంబంధించిందైనా అంతే ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇటు హీరో, హీరోయిన్లకు సంబంధించిందైనా అంతేనన్నమాట. అల్లూరి సీతారామరాజుగా నటించే రామ్ చరణ్, కొమరం భీమ్‌గా కనిపించనున్న ఎన్టీఆర్ ఇద్దరూ మంచి డాన్సర్లన్న విషయం తెలిసిందే. ఫ్లోర్ డ్యాన్సుల నుంచి ఎంత క్లిష్టమైన డ్యాన్సులనైనా చేసి మెప్పించగలరు. అందులోనూ జక్కన్న రాజమౌళి పాటలను తెరకెక్కించే విధానం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఆర్ ఆర్ ఆర్‌లో ఇద్దరు హీరోల స్టెప్పులు, రాజమౌళి స్టైల్ టేకింగ్‌లో పాటలను ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు జనాలు. అయితే ఈ సినిమా పాటల గురించి అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోలు స్టెప్పులు వేయడానికి పెద్దగా స్కోప్ లేదట. చెరొక పాట మాత్రమే ఉంటుందని టాక్. మరో పాట నేపథ్యంలో వస్తుందట. సో ఆర్ ఆర్ ఆర్ మొత్తం మీద మూడు పాటలు మాత్రమే ఉంటాయని తెలిసింది.
ఇందులో భాష కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే ట్రెండీ లాంగ్వేజ్ ఉండదని ఇంతకు ముందే ఎన్టీఆర్ చెప్పారు. చారిత్రక పురుషులు అల్లూరి, కొమరం భీమ్ జీవితాల్లో అజ్ఞాతంగా గడిపిన కొన్నాళ్లకు సంబంధించిన కాల్పనిక కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలియా భట్ మరో నాయిక. ఎమ్మా రాబర్డ్స్ అనే మరో నాయిక పేరు కూడా వినిపిస్తోంది. చిత్ర యూనిట్ నుంచి అధికారిక సమాచారం రానుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం చేస్తున్నారు. ఇటీవల బల్గేరియా షెడ్యూల్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రధానంగా రామ్‌చరణ్ మీద సాగుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments