పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్ ఆర్ ఆర్‌

  • IndiaGlitz, [Wednesday,October 31 2018]

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుండి అంచ‌నాల‌ను క్రియేట్ చేసుకుంది. హీరోల పాత్ర‌లు, క‌థా నేప‌థ్యంపై ప‌లు ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. కానీ దేనిపై యూనిట్ వ‌ర్గాలు మాత్రం స్పందించ‌లేదు. అయితే తాజాగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.

ఇందు కోసం రెండు భారీ సెట్స్‌ను సిద్ధం చేశారు. తొలి షెడ్యూల్ గండిపేట ద‌గ్గ‌రున్న సెట్‌లో చిత్రీక‌రిస్తే.. రెండో షెడ్యూల్‌లో యాక్ష‌న్ పార్ట్‌ను అల్యూమినియం ఫ్యాక్ట‌రీ సెట్‌లో చిత్రీకరిస్తార‌ట‌. ఇటు రామ్‌చ‌ర‌ణ్‌... అటు ఎన్టీఆర్ ఇమేజ్‌ల‌కు ఇబ్బంది లేకుండా విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌న్నివేశాల‌ను రాశార‌ట‌.