తెలంగాణలో ‘ఆర్ఆర్ఆర్ ’ టికెట్ ధరల పెంపు.. ఏంతంటే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్‌చరణ్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీకి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ధరలపై ప్రతి టికెట్‌కు రూ.50 పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే మొదటి మూడు రోజులు మాత్రమే రూ.50, ఆ తర్వాత 3 రోజులు రూ.30 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే ఐదో ఆటకూ అనుమతి ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకూ ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

ప్రభుత్వ నిర్ణయంతో .. ఆర్ఆర్ఆర్ మొదటి మూడు రోజుల్లో సింగిల్ స్క్రీన్‌లో రూ. 236, మల్టీప్లెక్సుల్లో రూ. 413 ... నాలుగో రోజు నుంచి సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 212, మల్టీప్లెక్స్‌లో రూ. 354 గా టికెట్ ధరలు వుండనున్నాయి. దీంతో ఈ ధరలను చూసి తెలంగాణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే.. హై బడ్జెట్‌ సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్‌కు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు ఈ పెంపునకు అనుమతి ఇచ్చింది. దీంతో మొదటి పదిరోజులు కనిష్టంగా రూ. 106, గరిష్టంగా రూ. 380గా ధరలు వుండనున్నాయి.

ఇకపోతే.. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్‌ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఉలిక్కిపడిన పార్టీ శ్రేణులు, స్పందించిన నారా లోకేష్

ఆధునిక యుగంలో అంత డిజిటల్‌గా మారిపోయిన తర్వాత సౌకర్యాలు పెరగడంతో పాటు నేరస్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది.

రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్ డాలీ మృతి, మాటలు రావడం లేదంటూ సురేఖవాణి పోస్ట్

శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూట్యూబర్, నటి డాలీ కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ నటి సురేఖా వాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కర్ణాటకలో ఘోర  రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం, చెల్లాచెదురుగా మృతదేహాలు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమ్మక్క- సారక్కలపై వ్యాఖ్యలు ... స్పందించిన చిన్నజీయర్

ఆదివాసి దేవతలైన సమ్కక్క- సారక్కలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై చినజీయర్ స్వామి స్పందించారు.

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు.. కొత్తది ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.