ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఆ సంస్థ చేతికి రైట్స్, ప్రీమియర్ ఎప్పుడంటే..?
- IndiaGlitz, [Sunday,December 12 2021]
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తోన్న ‘‘ఆర్ఆర్ఆర్’’ విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీమ్.. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా వుంది. లేట్ అయినా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్, చరణ్‌ల యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్స్, రాజమౌళీ టేకింగ్‌తో రోమాలు నిక్కబొడిచేలా వుంది ట్రైలర్. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడో చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. దీని థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.570 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. డిజిటల్, శాటిలైట్ హక్కుల పేరిట అప్పుడే రూ.300 కోట్లు వచ్చాయట. బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులతో పాటు భారతీయ భాషల డిజిటల్, శాటిలైట్, ఎలక్ట్రానిక్ హక్కులను సొంతం చేసుకుంది.
థియేటర్‌లోకి వచ్చేది సరే.. మరి ఓటీటీ పరిస్థితి ఏంటని చాలా మందికి డౌట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబధించి ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం సినిమా విడుదలైన 60 రోజులకు ఆర్ఆర్ఆర్ ఓటీటీలోకి రానుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ థియేటర్లో విడుదలైన 90 రోజుల తర్వాత జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో హందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుందని ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులు, ప్రముఖ నిర్మాత జయంతిలాల్ గడా స్పష్టం చేశాడు.