మార్చి 18 కాదు... ఏప్రిల్ 28 కాదు: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ ఇదే, ఈసారి మాత్రం పక్కా...!!!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ.. కరోనా, లాక్డౌన్ తదితర కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వచ్చింది. అన్ని విఘ్నాలను అదిగమించి 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నైల చుట్టూ చిత్ర యూనిట్ చక్కర్లు కొట్టి గ్రాండ్‌గా ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టింది.
ఇక జనవరి 7న రిలీజ్ కావడమే తరువాయి అనుకున్న టైంలో కరోనా, ఒమిక్రాన్ కారణంగా ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా పడింది. అనేక రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యూపెన్సీకే థియేటర్లు నడవాలని ప్రభుత్వాలు ఆదేశించడంతో ఆర్ఆర్ఆర్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోక తప్పలేదు. దీంతో అప్పటి వరకు పడిన శ్రమ, ప్రమోషన్ల కోసం పడిన ప్రయాస అంతా వృథా అయ్యింది. దీంతో మెగా, నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఊరట కలిగించేలా మొన్నామధ్య చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. మార్చి 18న లేదంటే.. ఏప్రిల్ 28న ఆర్ఆర్ఆర్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం... 'ఆర్ఆర్ఆర్' ఆ రెండు తేదీల్లో విడుదల కావడం లేదు. ఇదేదో వాయిదా వార్త అని ఫ్యాన్స్ నిరాశ పడొద్దు.. సంతోషకర వార్తే. మార్చి 18, ఏప్రిల్ 28 కాకుండా.. మార్చి 25న ఆర్ఆర్ఆర్ను విడుదల చేస్తున్నట్టు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com