ఈ టైంలో మా వల్ల కాదు .. ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా, చిత్రయూనిట్ అధికారిక ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
అనుకున్నదే నిజమైంది.. ఊహాగానాలే వాస్తవాలయ్యాయి. టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయలేమని చెబుతూ 'ఆర్ఆర్ఆర్' యూనిట్ ప్రేక్షకులను క్షమాపణలు కోరింది.
"తాము తీవ్రంగా ప్రయత్నించినా... కొన్ని పరిస్థితులు మా నియంత్రణలో లేవు. మాకు మరో ఆప్షన్ లేదు. అందుకని, మీ ఎగ్జైట్మెంట్ను మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగించాలని కోరుతున్నాం. సరైన సమయంలో... భారతీయ సినిమాకు పూర్వ వైభవం తీసుకు వస్తామని మాట చేస్తున్నాం" అని 'ఆర్ఆర్ఆర్' మూవీ యూనిట్ ట్వీట్ చేసింది.
వాస్తవానికి ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రెండు మూడుసార్లు వాయిదా పడింది. అప్పుడు దేశంలో కరోనా, లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ జరగలేదు. ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. జనవరి 7న సినిమా విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఓవర్సీస్కు ప్రింట్స్ పంపించేశారు. ప్రమోషన్స్ సైతం భారీగా జరుగుతున్నాయి. నోటి దాకా వచ్చిన సమయంలో వాయిదా అంటే నిర్మాతలకు, అభిమానులకు నిరాశే.
ఇక ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
Keeping the best interests of all the involved parties in mind, we are forced to postpone our film. Our sincere thanks to all the fans and audience for their unconditional love. #RRRPostponed #RRRMovie pic.twitter.com/JlYsgNwpUO
— RRR Movie (@RRRMovie) January 1, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com