అంచనాలు పెంచేసిన ‘‘ఆర్ఆర్ఆర్’’ గ్లింప్స్... ఫ్యాన్స్‌కి పూనకాలే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సిరీస్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళీ తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ జనవరి 7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో హైప్‌ను పెంచేందుకు, జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు రాజమౌళీ తన మార్క్ ప్రమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్ గ్లింప్స్’ పేరుతో 46 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా కీరవాణి ఇచ్చిన బీజీఎం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి వచ్చిన సర్‌ప్రైజ్‌లకు పూర్తిభిన్నంగా రామ్‌చరణ్- ఎన్టీఆర్ కలిసి ఉన్న సన్నివేశాలతో ఈ వీడియో రూపొందించారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా సిద్ధమవుతోందని అంచనా. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో నటిస్తున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments