'ఆర్ ఆర్ ఆర్' అంచనాలను పెంచేస్తున్న మోషన్ పోస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. మన్యం వీరుడు అల్లూరి సీతా రామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు.
ఇద్దరు పోరాట యోధులకు సంబంధించిన కల్పిత కథతో తెరకెక్కిన చిత్రమిది. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆర్ ఆర్ ఆర్‌కి ఫుల్ ఫామ్‌ను ఇచ్చారు. ‘‘ రౌద్రం రుధిరం రణం’’గా సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. ఒక పక్క రామ్‌చరణ్‌ను నిప్పుతో.. మరో పక్క ఎన్టీఆర్‌ను నీరుతో చూపిస్తూ వారిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చే సన్నివేశాన్నే మోషన్ పోస్టర్‌గా చూపించారు. అందులో టైటిల్‌ను ఆవిష్కరించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఈ కథ 1920లో జరిగే కథ అని మోషన్ పోస్టర్‌లో చెప్పారు. మోషన్ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది.
సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి సందర్బంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, తారక్‌లతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, ఆలిసన్ డూడి, ఒలివియా మోరిస్ కూడా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments